Sunday, December 30, 2012

సంగతులు 2012

1

ప్రతి ఏడాది  లాగే హుషారుగా వచ్చింది
తీపి చేదు ల మిశ్రమ రుచులందించి  వెడుతోంది
ఎప్పటి లానే నేరాలు జరుగుతూనే వున్నాయ్
శిక్ష  లు పడుతూనే వున్నాయ్
అయినా నేరాలు పెరుగుతూనే వున్నాయ్
నిత్యవసారాల ధరలు కొండ దాటి  నింగి నందుకున్నాయ్
ఆర్ధిక సంక్షోభం లాగానే ఇప్పుడు
రాజకీయ సంక్షోభం నడుస్తోంది కాబోలు
ఏ  పార్టీ లోను ధీమా కాన రావడం లేదు
ప్రత్యేక వ్యక్తులకు కొత్త జైళ్ళు కట్టించాలేమో
వున్న చోటు చాలదుగా మరి -

2

అటో  ఇటో మాత్ర,మే ఊగిసలాడే
తమిళ నాట అధికారం ఎప్పటి లానే
ఇటు నుంచి అటు పయనించింది -
లవర్ బాయ్ రాజేష్ ఖన్నా
లవ్ సినిమా ల యష్ చోప్రా ల
మరణం బాలీవుడ్ కు తీరని లోటు-
గుజరాత్ గురి తప్పక మళ్ళీ మోడీ కే దక్కింది
రానున్న వంట గ్యాస్ కట కట  కు
ఈ యేడాదే  సంకేతాలన్దాయ్

3

తెలుగు నాట పదవి కి  దగ్గర దారి
పాదయాత్రేనని పార్టీ లన్ని నమ్ముతున్నట్లున్నాయ్
నేతల్ని పలకరించలేక ప్రజలకే నానా ఇక్కట్లు

అనుకోని రీతిన "నీలం"
చేసింది అతలాకుతలం
యుగాంతమని హడావిడి చేసిన చానెళ్ళు
మరో సంచలనం వైపుకి మళ్లి నట్లున్న్నాయ్
ఆడి  ఆడి  అలసిన సచిన్
ఆరామానికి పయనం
మనవాళ్ళు కొంచెం ఫర్వాలేదనిపించిన ఒలింపిక్స్
అన్నీ మనకి జ్ఞాపకాలుగా అందించి
శెలవ్ అంటోంది ఈ యేడు
మన మధ్యకి రాబోతుంది పై యేడు

అందరికీ శుభం కలుగు గాక...









1 comment:

Padmarpita said...

అశావాదంతో సాగిపోదాం...