Friday, November 16, 2012

ఎప్పటికీ ...



కలసి రానీ  నీ నడకల్లో
తడిసిపోనీ నీ పలుకుల్లో
మునిగి పోనీ నీ నవ్వుల్లో
తేలిపోనీ  నీ పాటల్లో

ఎప్పటికీ ...


నిట్టూర్పుల జాడేదీ
నిరాశకు తావేదీ
విరహానికి చోటేదీ
మన బంధం లో

ఎప్పటికీ ...


ప్రతి రుతువొక వాసంతం కాదా నీ సాంగత్యంలో
ప్రతి క్షణమొక పండగ కాదా నీ స్నేహంలో
ప్రతి సాయంత్రం సందడి  కాదా నీ తోడుంటే
ప్రతి అడుగు నాట్యం కాదా నీ వెంటుంటే

ఎప్పటికీ ...








No comments: