Monday, May 13, 2013

బ్లాగ్ స్పెషల్

బ్లాగ్ స్పెషల్ 

మనలో వున్న ఆలోచనలు పంచుకునేందుకు బ్లాగ్ ఒక చక్కని వేదిక . ఏదో తోచింది రాసి పారేయడం కాకుండా మనకు ఆసక్తి మెండు గా వున్న సబ్జెక్ట్ నెంచుకొని చక్కగా హోం వర్క్ చేసి ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కంటెంట్ ఎంతుంది అనే దాని కన్నా ఎంత రెగ్యులర్ గా ఇస్తున్నామో ముఖ్యం. రాజకీయాల మీద వ్యాఖ్య లే కావచ్చు సినిమాలు ఆటలు టెక్నాలజీ ఏదైనా ఒక స్పెషల్ అయితే బావుంటుంది . 

Sunday, May 12, 2013

ఆన్ లైన్ లో ప్రసాదం ...

ఆన్ లైన్ లో ప్రసాదం ... 

మీరు చదివిన హెడ్డింగ్ నిజమేనండీ .. ఈ రోజుల్లో ఇంటర్నెట్ పుణ్యామాని ఏదైనా ఓ మౌస్ క్లిక్ తో తెప్పించెసుకొవచ్చు. అలాగే ఇ -కామర్స్ రోజు రోజుకీ అభివృద్ధి చెందు తుంది . ఇదిగో అదే దారిన మరో అవకాశం మనకిష్టమైన పుణ్య క్షేత్రాల నుండి ఇంట్లో నే కూర్చుని ప్రసాదం తెప్పించుకునే అవకాశాన్ని onlineprasad.com అందిస్తోంది . మన స్నేహితులనో బంధువులనో బాసులనో పలకరిచేటప్పుడు ఇలాంటి సేవలు వినియోగించుకుంటే బావుంటుందని పిస్తుంది . దర్శనం లేకుండా ఒట్టి  ప్రసాదం ఏంటని విసుక్కోని  వాళ్ళు ఈ సేవలను ట్రై చెయొచ్చు. 

Saturday, May 11, 2013

గెలుపు

గెలుపు 

ఎన్ని నిర్వచనాలు జీవితం గురించి ఉండనీయండి నన్ను అడిగితే మాత్రం జీవితమంటే "గెలిచి తీరాల్సిన పందెం" అంటా ను. గెలుపంటే ఇన్ని కోట్లు సంపాయించడమో ఓ పదవో  ఉద్యోగమో వెలగబెట్టడం కాదు. ఎటువంటి పరిస్తుతులనైనా ఎదుర్కోగల సత్తా పెంపొందించుకోడం . ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని జీవితం విసిరే ప్రశ్నలకు బదులు చెప్పాలంటే ఆ మాత్రం శక్తి  కావాలి. అదే అసలైన సంపద...  అసలైన గెలుపు. 

మనకు ఆత్మా విశ్వాసాన్ని పెంపొందించే పుస్తకాలు మీకేన్ని తెలుసో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ కు వెళ్ళండి.   
అక్కడ ప్రశ్నల తో బాటు బదులు దొరుకుతున్ది. అలాగే కొన్ని పుస్తకాల జాబితా కూడా దొరుకుతుంది .