Thursday, October 11, 2012

ఏలూరుto విశాఖపట్నం  

ఏలూరు దాటగానే ఏ ఊరు అని అడగక్కరలే
బాటకిరువైపులా పరచుకున్న పచ్చదనం 
రైతన్నల కళా నైపుణ్యం చూపిస్తుంది 
తాడేపల్లిగూడెం  లో తాతల నాటి ఇళ్ళు 
నాటి సౌకర్యాల బ్రతుకు ఆనవాళ్ళు .....
నిలకడగా నిడదవోలు లో రైలు నిలవదుగా 
రా  రమ్మని రాజమండ్రి పిలుస్తుంటే 
అన్ని దారులు కన్నా గోదారి భలే బావుంటుంది 
ఆ దారి దాటితే కోటలే  లేని కోట సామర్లకోట 
నవ్వుకుని సాగితే 
'అన్న'వరం నిలుపుకో సామి అని సత్య దేవునికో దండం 
తుని  లో మనకేంపని  అనుకోవచ్చు 
దాటితే అనకపల్లె ..........
అలసటకు  కాస్త విసుగు పుట్టి విశాఖ ఎక్కడా అనుకుంటుంటే 
దువ్వాడ దాటితే గాని 
రాదు మరి విశాఖ .......................

( మా అత్త  గారి ఊరు విశాఖపట్నం. నేను ఏలూరు చేరుకొని రైలు పట్టుకొని బోలెడు ప్రయాణం చేస్తే గాని రాదా  ఊరు. ఆ ప్రయాణం లో ఆలోచనలే ఈ తికమక కవిత  కి ప్రేరణ )

No comments: